

సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి ‘ధర్మన్’ చిత్రంలో నటిస్తున్న రాశి ఖన్నా, షూటింగ్ సమయంలో జరిగిన ఓ ప్రత్యేక అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ విరామంలో ఆధ్యాత్మికతపై జరిగిన సంభాషణలో రజినీకాంత్ ‘లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్’ పుస్తకం గురించి అడిగారని, తాను చదవలేదని చెప్పడంతో రెండు రోజులకే ఆ పుస్తకాన్ని స్వయంగా కొనిచ్చారని తెలిపారు. అంతేకాక, చదివిన తర్వాత ప్రశ్నలు కూడా అడుగుతానని చెప్పడంతో ఎంతో ఆసక్తిగా ఆ పుస్తకాన్ని చదవడం ప్రారంభించానని వెల్లడించారు.
ఆ పుస్తకం తనలో ఎంతో ఆత్మపరిశీలన కలిగించిందని రాశి ఖన్నా చెప్పారు. ఇతరులను మెప్పించాలనే ప్రయత్నంలో మన అసలు వ్యక్తిత్వాన్ని కోల్పోతామని, నిజమైన ఎదుగుదల అంటే కొత్త వ్యక్తిగా మారడం కాదు, మనం ధరించిన నకిలీ ముసుగులను తొలగించి మన నిజస్వరూపాన్ని అంగీకరించడమేనని తాను గ్రహించినట్లు తెలిపారు. రజినీకాంత్ ఇచ్చిన ఈ బహుమతి తన జీవితంలో ఒక నిశ్శబ్దమైన కానీ విలువైన పాఠంగా నిలిచిపోయిందని ఆమె అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!