

వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉన్న ప్రీతి జింటా దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ‘బట్వార్ 1947’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఒకప్పుడు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సూపర్ హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, మహేష్ బాబుతో ‘రాజకుమారుడు’, వెంకటేష్‌తో ‘ప్రేమంటే ఇదేరా’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇప్పుడు సన్నీ డియోల్ సరసన కీలక పాత్రలో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు.
1947 దేశ విభజన నేపథ్యంలో రూపొందిన ఈ భావోద్వేగభరితమైన పీరియాడికల్ డ్రామాను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. షబానా అజ్మీ, ఆలీ ఫజల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం షూటింగ్‌తో పాటు అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!