

రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ప్రస్తుతం వేగం పుంజుకుంటున్నాయి. అయితే పాటల ఎంపిక విషయంలో మాత్రం చిత్రబృందం అనుసరిస్తున్న విధానం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘జైలర్’లో హుకుమ్ వంటి మాస్ పాటతో సంచలనం సృష్టించిన అనిరుధ్, ఈసారి అలా బొలేలో, వన్ సన్ వన్ మూన్ వంటి మెలోడీ పాటలను ముందుగా విడుదల చేశారు.
రజినీకాంత్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అదిరిపోయే మాస్ పాట కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ట్రాక్స్ ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని ఇవ్వలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అసలు మాస్ పాటలను, కీలకమైన సన్నివేశాలను చివరి దశ ప్రచారంలో బయటపెట్టాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. విడుదలకు ఇంకా 3 వారాల సమయం ఉండటంతో రాబోయే రోజుల్లో ట్రైలర్, కొత్త పాటలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆసక్తిగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!