

‘ఇరుముడి’ సినిమా ఘన విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. హీరో రవితేజను ప్రశంసిస్తూ.. సినిమాలో త్రినాథ్ పాత్రను అద్భుతంగా మోశారని కొనియాడారు. దర్శకుడు శివ నిర్వాణ సినిమాను ఎంతో లోతైన భావోద్వేగాలతో తెరకెక్కించారని ప్రశంసించారు. బాలనటి నక్షత్రకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదిస్తూ, నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
“ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి” అంటూ చిరంజీవి పేర్కొన్నారు. తన సినిమా గురించి చిరంజీవి ప్రశంసలు అందించడంపై దర్శకుడు శివ నిర్వాణ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మాటలు తనకు ఎంతో ప్రత్యేకమని, ‘ఇరుముడి’ ఆత్మను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. హీరో రవితేజ కూడా అన్నయ్య చిరంజీవికి ధన్యవాదాలు చెప్పారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!