

హ్యాకింగ్, ఫిషింగ్, ఆన్‌లైన్ స్కామ్‌ల నుంచి యూజర్లను రక్షించేందుకు వాట్సాప్ కొత్త సెక్యూరిటీ అప్‌డేట్లను తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న రెండు దశల ధృవీకరణ ఫీచర్‌ను మరింత బలోపేతం చేసింది. ఇకపై ఆరు అంకెల వెరిఫికేషన్ పిన్‌కు బదులుగా ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. యూజర్ వన్‌టైమ్ పాస్‌వర్డ్ (OTP)ను ఎవరో పొందినా ఖాతాను హైజాక్ చేయడం కష్టతరం చేయడమే దీని ఉద్దేశం.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు పాస్‌కీ సదుపాయాన్ని కూడా విస్తరించింది. ఒక వాట్సాప్ ఖాతాకు ఒకటి కంటే ఎక్కువ పాస్‌కీలను జోడించుకోవచ్చు. పాస్‌కీ ద్వారా ఫింగర్‌ప్రింట్, ఫేస్ ఐడీ లేదా ఫోన్ స్క్రీన్ లాక్‌తో వాట్సాప్‌లోకి తిరిగి లాగిన్ కావచ్చు. మరోవైపు ఆండ్రాయిడ్ యూజర్లకు తెలియని నంబర్ల నుంచి కాల్ వచ్చినప్పుడు ఆ నంబర్ ఏ దేశానికి చెందినదో, తమతో ఏదైనా వాట్సాప్ గ్రూప్‌ను షేర్ చేసుకుంటున్నారా వంటి అదనపు సమాచారం కనిపిస్తుంది. అనుమానాస్పద కాల్స్‌ను గుర్తించి స్కామ్‌ల బారిన పడకుండా యూజర్లను అప్రమత్తం చేయడమే ఈ ఫీచర్ల లక్ష్యం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!