

పాయల్ రాధాకృష్ణ తెలుగు సినిమాలు, సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘ప్రసన్న వదనం’, ‘అలా నిన్ను చేరి’, ‘చౌర్య పాఠం’, ‘పాపం ప్రతాప్’ వంటి చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. త్వరలో ‘హ్యాపీ జర్నీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
తాను సిగరెట్లు తాగనని పాయల్ తెలిపింది. అయితే డ్రింక్ మాత్రం అప్పుడప్పుడు తన తండ్రితో కలిసి ఇంట్లోనే తీసుకుంటానని చెప్పింది. తనకు మొదటి డ్రింక్‌ను కూడా తన తండ్రే ఆఫర్ చేశారని వెల్లడించింది. అయితే తనకు డ్రింకింగ్‌పై పెద్దగా ఆసక్తి లేదని స్పష్టం చేసింది. తన తండ్రి ఎంతో అద్భుతమైన వ్యక్తి అని, ప్రస్తుతం ఫెమినిజం గురించి విస్తృతంగా మాట్లాడుతున్నప్పటికీ.. చాలా కాలం క్రితమే తన తండ్రి ప్రగతిశీల ఆలోచనలతో మహిళలకు అండగా నిలిచారని పాయల్ ప్రశంసించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!