

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. చాలా కాలం తర్వాత రవితేజ నుంచి సినిమా వస్తుండటంతో అభిమానులు, సాధారణ ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. మరోవైపు అమెరికా మార్కెట్లోనూ ప్రీ-సేల్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. విడుదలకు ముందే ఈ చిత్రం 2.5 లక్షల డాలర్ల గ్రాస్‌ను దాటినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో ‘ఇరుముడి’ రవితేజ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందనే అంచనాలు పెరుగుతున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. విడుదలకు ముందే కనిపిస్తున్న బుకింగ్స్ జోరు, ప్రీ-సేల్స్ థియేట్రికల్ వసూళ్లపై అంచనాలను పెంచుతోంది. మరి ఈ హైప్‌ను సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!