

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ సినిమా విడుదల తేదీపై కొత్త చర్చ మొదలైంది. టాక్సీవాలా తర్వాత విజయ్‌తో దర్శకుడు మరోసారి కలిసి పనిచేస్తుండటం, విజయ్-రష్మిక హిట్ జోడీ మళ్లీ తెరపై కనిపించనుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కారణంగా నిర్ణయించిన సమయానికి సినిమా పూర్తయ్యే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది.
దసరా సీజన్‌లో ఇప్పటికే అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’, అక్టోబర్ 15న ‘జైలర్ 2’ విడుదలలు ఖరారవడంతో కొత్త విడుదల తేదీపై చిత్రబృందం ఆలోచనలు ప్రారంభించినట్లు సమాచారం. అక్టోబర్ 16 తేదీని కూడా పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. నవంబర్ అన్‌సీజన్ కావడం, డిసెంబర్‌లో భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో పండుగ సీజన్‌కు అనుకూలమైన తేదీని ఖరారు చేసే దిశగా మేకర్స్ కసరత్తు చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (1)
waiting