

అసమానతలు, అన్యాయాలు, నిజాం నిరంకుశ పాలనపై తన కలంతో అగ్నిధారలు కురిపించిన ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్యులు జయంతి నేడు. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఆయన, సమానత్వ సమాజాన్ని కలగన్న అభ్యుదయ కవి. తన రచనల ద్వారా సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో నింపారు.
తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషలపై పట్టు సాధించిన దాశరథి, మీర్జా గాలిబ్ గీతాలను తెలుగులోకి అనువదించారు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం వంటి ఖండకావ్యాలతో పాటు తిమిరంతో సమరం కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. సమాజంలోని అసమానతలను తన కవిత్వంతో ప్రశ్నించిన మహాకవిగా ఆయన చిరస్థాయిగా నిలిచారు.
సాహిత్యంతో పాటు తెలుగు సినీ గేయరచయితగా కూడా దాశరథి విశేష గుర్తింపు పొందారు. “నీవురావు నిదుర రాదు”, “ఖుషి ఖుషిగా నవ్వుతూ” వంటి చిరస్మరణీయ గీతాలను రచించారు. 1925 జూలై 22న మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించిన ఆయన, 1987 నవంబర్ 5న కన్నుమూశారు. అయినప్పటికీ ఆయన సాహిత్యం, ఆలోచనలు నేటికీ తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!