

టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఇటీవల వచ్చిన ఆయన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో తదుపరి ప్రాజెక్ట్ ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. తాజా ప్రచారం ప్రకారం, ‘35 చిన్న కథ కాదు’ సినిమాతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ధీరజ్ మొగిలినేని దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రకటన అనంతరం రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశముంది. ‘35 చిన్న కథ కాదు’ చిత్రం 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ బాలల చిత్రం అవార్డు సాధించగా, మాస్టర్ అరుణ్ దేవ్ పోతులు ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నారు. దీంతో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!