

ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో నాయకత్వాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. న్యూజెర్సీలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌ను ట్రంప్, గియాని ఇన్ఫాంటినో కలిసి వీక్షించిన అనంతరం, ప్రపంచ దేశాలను ఏకం చేసే నాయకత్వ సామర్థ్యం గియానికి ఉందని ట్రంప్ అభినందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆయనను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పదవికి ప్రతిపాదించాలనే అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేసినట్లు ఆయన ప్రత్యేక ప్రతినిధి పౌలో జంపోలి వెల్లడించారు.
అయితే ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక ప్రక్రియ అత్యంత పోటీతో కూడుకున్నది. ఈ పదవికి 15 సభ్యులతో కూడిన ఐరాస భద్రతా మండలి మద్దతుతో పాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి శాశ్వత సభ్య దేశాల వీటోను తప్పించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ పదవీకాలం ఈ ఏడాది చివరితో ముగియనుంది. గియాని ఇన్ఫాంటినో పేరు చర్చలో ఉన్నప్పటికీ, ఈ ప్రతిపాదనకు ఐరాస సభ్య దేశాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!