
జనరల్

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా సంచలనం సృష్టించిన అవికా గోర్, ఈ సీరియల్ ప్రారంభమై 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆనంది పాత్ర తనకు కేవలం గుర్తింపే కాకుండా ఒక వ్యక్తిగా కూడా ఎంతో మార్పు తీసుకువచ్చిందని తెలిపారు. మంచి కథ సమాజంలో ఎంత ప్రభావం చూపుతుందో ఈ సీరియల్ ద్వారా అర్థమైందని ఆమె పేర్కొన్నారు.
షూటింగ్ స్పాట్నే తనకు నటన నేర్పిన మొదటి పాఠశాలగా భావిస్తున్నానని అవికా చెప్పారు. సీనియర్ నటులను గమనిస్తూ నటనలోని భావ వ్యక్తీకరణలు నేర్చుకున్నానని తెలిపారు. అక్కడ పొందిన క్రమశిక్షణ, ఓపిక తన ఎదుగుదలకు కారణమని చెప్పారు. చిన్న వయసులో పెళ్లిళ్ల సమస్య, ఆడపిల్లల విద్య, హక్కులపై ఈ సీరియల్ గొప్ప సందేశం ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!