

చిన్న సినిమాగా విడుదలైన ‘మహావతార్ నరసింహ’ భారీ విజయాన్ని సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రతిష్టాత్మకమైన 98 వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్) నామినేషన్లకు అర్హత సాధించింది. నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. థియేటర్లలో, ఓటీటీలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్స్ రేసులోకి అడుగుపెట్టడం మరో అరుదైన గౌరవం. తుది నామినేషన్ జాబితా 2026 జనవరి 22న వెలువడనుంది.
హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ రూపొందించారు. నరసింహ పురాణం, విష్ణు పురాణం, శ్రీమద్ భాగవత పురాణాలను ఆధారంగా తీసుకుని ఈ యానిమేటెడ్ సినిమాను తెరకెక్కించారు. 2026 ఆస్కార్స్‌లో మొత్తం 35 యానిమేటెడ్ చిత్రాలు తుది దశలో పోటీ పడుతున్నాయి. ‘మహావతార్ నరసింహ’ నామినేషన్ సాధిస్తే, ఆస్కార్ నామినేషన్ పొందిన తొలి భారతీయ యానిమేటెడ్ చిత్రం అవుతుంది. దీంతో అందరి దృష్టి నామినేషన్ ప్రకటనపై నిలిచింది.
98 వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్లు 2026 జనవరి 22 న ప్రకటించబడతాయి. అవార్డుల కార్యక్రమం మార్చి 15, 2026 న జరుగుతుంది. ఇదిలా ఉండగా, నీరజ్ గయ్వాన్ దర్శకత్వంలో వచ్చిన ‘హోంబౌండ్’ చిత్రం ఇప్పటికే భారత్ నుంచి అధికారికంగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్స్‌కు ఎంపికైంది.










.png&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!