8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

“నా కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనేదే నా లక్ష్యం”-దొర సాయి తేజ

Writer: Chandrika 11:08 AM, 8 ఆగస్టు, 2026
“నా కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనేదే నా లక్ష్యం”-దొర సాయి తేజ

‘దందా’ సిరీస్‌తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దొర సాయి తేజ తన సినీ ప్రయాణం, కంటెంట్‌ క్రియేషన్‌, నటన, దర్శకత్వం, సోషల్‌ మీడియా, మార్కెటింగ్‌ వంటి అంశాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిన్నతనంలోనే ప్రభాస్‌ నటించిన ‘అడవి రాముడు’ సినిమాలో బాల నటుడి పాత్రకు డబ్బింగ్‌ చెప్పిన ఆయన.. ‘కొత్త బంగారులోకం’, ‘హై స్కూల్‌’ వంటి సిరీస్‌లలో నటించారు. ‘అలా మొదలైంది’ సినిమాలోనూ చిన్న పాత్ర పోషించారు. 2016లో రామ్‌గోపాల్‌ వర్మతో పరిచయం ఏర్పడిన తర్వాత సినిమా రంగంపై మరింత అవగాహన వచ్చిందని తెలిపారు. 2018లో ‘బ్యాక్‌ బెంచర్స్‌’ సిరీస్‌తో యూట్యూబ్‌ ప్రయాణాన్ని సీరియస్‌గా ప్రారంభించి, పలు సిరీస్‌లు, కంటెంట్‌ ప్రాజెక్టులు చేసిన అనంతరం సొంతంగా కంటెంట్‌ క్రియేషన్‌ సంస్థను ప్రారంభించారు. కంటెంట్‌ క్రియేషన్‌ తన బిజినెస్‌ అయితే.. సినిమా తన ప్యాషన్‌ అని ఆయన చెప్పారు.

తన పని విధానం గురించి మాట్లాడుతూ.. కంటెంట్‌ క్రియేటర్‌, డైరెక్టర్‌, యాక్టర్‌, ప్రొడ్యూసర్‌గా నిరంతరం ఆలోచిస్తానని సాయి తేజ తెలిపారు. తనకు తానే కొత్త విషయాలు నేర్చుకోవడం, ఎదురుదెబ్బల నుంచి పాఠాలు తీసుకోవడం తన అలవాటని చెప్పారు. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రశంసలు, విమర్శలను సమానంగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. డిజిటల్‌ ఫాలోయింగ్‌ను థియేటర్ల వరకు తీసుకెళ్లే వేదికగా కంటెంట్‌ క్రియేషన్‌ను ఉపయోగించాలనుకుంటున్నట్లు తెలిపారు. ‘దందా’లో అరవింద్‌ పాత్ర తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, అలాంటి ఛాలెంజింగ్‌ పాత్రలు రావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నానన్నారు. దర్శకుడు ఆదిత్య దేవులపల్లి విజన్‌ వల్లే ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చిందని ప్రశంసించారు. తాను సాధారణంగా సింగిల్‌ టేక్‌లో సన్నివేశాలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని, ఎక్కువ టేక్స్‌ తీస్తే నిర్మాణ వ్యయం పెరుగుతుందని వివరించారు.

ప్రస్తుత కాలంలో కంటెంట్‌తో పాటు మార్కెటింగ్‌ కూడా ఎంతో కీలకమని సాయి తేజ అభిప్రాయపడ్డారు. ఎంత మంచి కంటెంట్‌ ఉన్నా.. దాని గురించి ప్రేక్షకులకు సరైన విధంగా తెలియజేసే ప్రమోషన్‌ లేకపోతే ఫలితం ఉండదని చెప్పారు. ‘దందా’ కోసం ప్రత్యేకమైన ప్రమోషనల్‌ వీడియో రూపొందించడం ప్రేక్షకులకు సిరీస్‌ కాన్సెప్ట్‌ను అర్థమయ్యేలా చేసిందన్నారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని, వారి మాటలు, ప్రవర్తన, దుస్తులు, అభిప్రాయాలు కూడా ఫాలోవర్లపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో సామాన్య ప్రేక్షకులు తమను తాము చూసుకోగలిగే కథలను తెరకెక్కించాలని, ‘జీరో టు హీరో’ తరహా పాత్రలు పోషించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరికీ స్ఫూర్తినిచ్చే కథలు, మంచి సందేశాన్ని అందించే ప్రాజెక్టులు చేయడమే తన లక్ష్యమని చెప్పారు. “ప్రేక్షకులు నా కోసం ఖర్చు చేసే డబ్బులకు న్యాయం చేయాలి” అనే ఆలోచనతోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని దొర సాయి తేజ స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణ’..ఎందుకంటే?

విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణ’..ఎందుకంటే?

పాతబస్తీలో నిహారిక కొణిదెల సందడి..

పాతబస్తీలో నిహారిక కొణిదెల సందడి..

ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్!

ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్!

ఓజి: బుల్లితెరపై సందడికి సిద్ధం!

ఓజి: బుల్లితెరపై సందడికి సిద్ధం!

ది ప్యారడైజ్ టీజర్‌కి మళ్లీ పాజిటివ్ వైబ్స్!

ది ప్యారడైజ్ టీజర్‌కి మళ్లీ పాజిటివ్ వైబ్స్!

జాన్వీ - శ్రీలీల: వరుస అవకాశాలు.. కానీ గుర్తింపు కరువు?

జాన్వీ - శ్రీలీల: వరుస అవకాశాలు.. కానీ గుర్తింపు కరువు?

ట్యాగ్లు
దొర సాయి తేజదందా సిరీస్‌దందాఆదిత్య దేవులపల్లితెలుగు వెబ్‌ సిరీస్‌తెలుగు నటుడుకంటెంట్‌ క్రియేటర్‌తెలుగు సినిమాసోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌డిజిటల్‌ కంటెంట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెస్సీని చంపేందుకు కుట్ర జరిగిందా?
క్రీడలు

మెస్సీని చంపేందుకు కుట్ర జరిగిందా?

నేడు సీఎం విజయ్ నేతృత్వంలో కీలక భేటీ...
రాజకీయాలు

నేడు సీఎం విజయ్ నేతృత్వంలో కీలక భేటీ...

చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్‌..
క్రీడలు

చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్‌..

విదేశాల్లో  ముందే ‘రామాయణ’ రిలీజ్...
సినిమాలు

విదేశాల్లో ముందే ‘రామాయణ’ రిలీజ్...

రాహుల్‌ వ్యాఖ్యలకు రిజిజు సెటైరికల్‌ రియాక్షన్‌..
రాజకీయాలు

రాహుల్‌ వ్యాఖ్యలకు రిజిజు సెటైరికల్‌ రియాక్షన్‌..

అరుణాచలం లో అమిత్‌ షా పర్యటన;భారీ భద్రత ఏర్పాటు
జనరల్

అరుణాచలం లో అమిత్‌ షా పర్యటన;భారీ భద్రత ఏర్పాటు

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్...
జనరల్

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్...

బోనాల పండుగ వేళ మద్యం దుకాణాలు బంద్‌..
జనరల్

బోనాల పండుగ వేళ మద్యం దుకాణాలు బంద్‌..

పాతబస్తీలో నిహారిక కొణిదెల సందడి..
సినిమాలు

పాతబస్తీలో నిహారిక కొణిదెల సందడి..

“నా కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనేదే నా లక్ష్యం”-దొర సాయి తేజ
సినిమాలు

“నా కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనేదే నా లక్ష్యం”-దొర సాయి తేజ

భారత్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్ల షాక్‌..
క్రీడలు

భారత్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్ల షాక్‌..

ఫిఫా పేరుతో నీట్ పేపర్ లీక్ గ్రూప్
జనరల్

ఫిఫా పేరుతో నీట్ పేపర్ లీక్ గ్రూప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!