
సినిమాలు

‘ప్రేమలు’ సినిమాతో దక్షిణాది భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ మమితా బైజు ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె చేతిలో ‘ఇరుందు వానం’, ‘జననాయగన్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి పలు ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా నటిస్తున్న సినిమాల నుంచి ప్రత్యేక పోస్టర్లను విడుదల చేస్తూ చిత్రబృందాలు శుభాకాంక్షలు తెలిపాయి.
ఇదిలా ఉండగా, మమితా నటిస్తున్న ‘ఇరుందు వానం’ సినిమా షూటింగ్ పూర్తై విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా ఫైనల్ కాపీ చూస్తున్నప్పుడు తాను భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపింది. దాదాపు మూడు సంవత్సరాల పాటు ఈ చిత్రంపై పని చేశామని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత పూర్తయిన సినిమాను చూడటం ఎంతో ప్రత్యేక అనుభూతిని కలిగించిందని ఆమె పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!