
సినిమాలు

సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ‘వారణాసి’ చిత్రబృందం ప్రత్యేక ట్రీట్ ఇచ్చింది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబు పోషిస్తున్న ‘రుద్ర’ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జత చేశారు.
సాధారణంగా క్లాస్, హ్యాండ్సమ్ లుక్‌లో కనిపించే మహేష్ బాబు. ‘వారణాసి’ ఫస్ట్ లుక్‌లో పూర్తి భిన్నమైన అవతారంలో కనిపిస్తున్నారు. ఒత్తైన జుట్టు, గడ్డం, మీసాలతో రగ్గడ్, మాస్ అడ్వెంచర్ లుక్‌లో ఆయన ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!