
జనరల్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు అరెస్ట్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమను తెలంగాణ పోలీసులమని పరిచయం చేసుకున్న అధికారులు ఈ చర్య చేపట్టారని వారు పేర్కొన్నారు. టెలివిజన్ డిబేట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తామని అధికారులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అయితే ఎలాంటి ముందస్తు నోటీసులు లేదా చట్టపరమైన సమాచారం ఇవ్వకుండా నాగార్జున యాదవ్‌ను అరెస్ట్ చేయడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, నమోదు చేసిన సెక్షన్లు మరియు పోలీసుల అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!