

శర్వానంద్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న "జార్జ్ క్రిష్"పై ఆసక్తికరమైన వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి రవీనా టాండన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. కథలో కీలక మలుపులు తీసుకొచ్చే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తికాగా, షూటింగ్ కార్యక్రమాలు కూడా వేగంగా ముందుకు సాగుతున్నాయి. హీరో, హీరోయిన్ మధ్య సాగే ప్రేమ సన్నివేశాలతో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు రెండో వారంలో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. సంక్రాంతి బరిలో సినిమాను తీసుకురావాలనే లక్ష్యంతో వేగంగా పనులు కొనసాగుతున్నాయని సమాచారం. గతంలో గోపీచంద్‌తో తెరకెక్కించిన "విశ్వం" ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో, ఈసారి తప్పకుండా విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో శ్రీను వైట్ల పనిచేస్తున్నారట. టాలీవుడ్‌లో మళ్లీ తనదైన ముద్ర వేసేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!