

రణబీర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ప్రాజెక్ట్ "రామాయణ"పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో, ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సృష్టించింది. ట్రైలర్ విడుదలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు సాగాయి. ముఖ్యంగా జూలై 18న కామిక్ కాన్ వేదికగా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారనే వార్తలు విస్తృతంగా వైరల్ అయ్యాయి.
అయితే ఈ ప్రచారాలన్నింటికీ మేకర్స్ అధికారికంగా తెరదించారు. "రామాయణ" గ్రాండ్ ట్రైలర్ ప్రీమియర్ జూలై 24 నుంచి ప్రారంభం కానుందని స్పష్టంచేశారు. విడుదల చేసిన పోస్టర్‌లో రాముడు, సీత, లక్ష్మణులు అయోధ్యను విడిచి వనవాసానికి బయలుదేరుతున్న దృశ్యం కనిపించడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, భారతీయ ఇతిహాస గాథ కలయికగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పెద్ద తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు జూలై 24న విడుదల కానున్న ట్రైలర్‌పైనే నిలిచింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!