

బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ సినీ పరిశ్రమలో మహిళా ప్రధాన చిత్రాలకు తక్కువ బడ్జెట్లు, తక్కువ మద్దతు లభిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇటీవల ఆమె కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొని ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
భారతదేశం వైవిధ్యభరితమైన దేశమని, మన సంస్కృతి, పురాణాలపై ఆధారపడి మహిళా కథలను రూపొందించడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అయితే మహిళా ప్రధాన చిత్రాలకు హీరోల సినిమాల స్థాయిలో బడ్జెట్లు, బాక్సాఫీస్ మద్దతు లభించడంలేదని తెలిపారు. ఈ వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉందని, దాన్ని అధిగమించడానికి నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ముందుకు సాగుతూ పని చేయడమే మార్గమని, ఇది తనతో పాటు భవిష్యత్ తరాల నటీమణుల కోసం కూడా అవసరమని హ్యూమా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆమె యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!