

తాజాగా జరిగిన రిపబ్లిక్ సమ్మిట్లో పాల్గొన్న రామ్ చరణ్ తన సినీ ప్రయాణం, వారసత్వం, ప్రేక్షకుల ఆదరణ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా కుటుంబం నుంచి రావడం వల్ల తొలి అవకాశాలు త్వరగా రావొచ్చని, కానీ ఆ తర్వాత ప్రేక్షకులు కేవలం కష్టం, ప్రతిభ, నిజాయతీనే చూస్తారని అన్నారు. చిన్నప్పటి నుంచి తన తండ్రి చిరంజీవిని మించిన నటుడిగా ఎదగాలని చాలామంది చెప్పేవారని, అయితే ఆ ఒత్తిడిని ఎప్పుడూ మనసుకు తీసుకోలేదని వెల్లడించారు. నటన విషయంలో చిరంజీవి ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, కానీ క్రమశిక్షణ విషయంలో ఆయనే తనకు ఆదర్శమని పేర్కొన్నారు.
ఓటీటీలు మరియు థియేటర్ల భవిష్యత్తుపై మాట్లాడుతూ, రెండూ పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నెట్ఫ్లిక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరుకోవడంతో అంతర్జాతీయ గుర్తింపు పెరిగిందని గుర్తుచేశారు. భారతదేశంలో సినిమా ఇప్పటికీ అత్యంత అందుబాటులో ఉన్న వినోదమని, థియేటర్ అనుభవాన్ని మరింత మెరుగుపరిస్తే ప్రేక్షకులకు ఇంకా దగ్గరవుతుందని చెప్పారు. దేశభక్తి, ఐక్యతను ప్రతిబింబించే కథలకు ప్రేక్షకులు ఎప్పటికీ మద్దతు ఇస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!