

రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక వ్యూహంతో విడుదల కానుంది. నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. ముందుగా నవంబర్ 6న విదేశీ మార్కెట్లలో సినిమాను విడుదల చేయనున్నారు. అనంతరం దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 8న భారతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముందుగా సినిమాను విడుదల చేసి, ఆ తర్వాత భారత్‌లో పండుగ సీజన్‌ను టార్గెట్ చేయడం ఆసక్తిని పెంచుతోంది.
దిగ్గజ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీత బాధ్యతలు చేపట్టారు. భారత్‌లో ధర్మ ప్రొడక్షన్స్ పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఓవర్సీస్ హక్కులను సోనీ పిక్చర్స్ సొంతం చేసుకోగా, సంగీత హక్కులను టీ-సిరీస్ రూ.75 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!