Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, ఏప్రిల్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

'అగధ' లో ప్రముఖ నటి మంజుల మనవరాలు

12:40 PM, 30 ఏప్రిల్, 2026
'అగధ' లో ప్రముఖ నటి మంజుల మనవరాలు

తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందిన మంజుల అనేక సూపర్ హిట్ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు వంటి ప్రముఖ నటులతో కలిసి ‘మనుషులంతా ఒక్కటే’, ‘మగాడు’, ‘నేరం నాది కాదు ఆకలిది’, ‘దొరబాబు’, ‘బంగారు బొమ్మలు’, ‘మహాకవి క్షేత్రయ్య’, ‘మాయదారి మల్లిగాడు’, ‘రక్తసంబంధాలు’, ‘మంచి మనుషులు’, ‘పిచ్చిమారాజు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తూ, మంజుల కూతురు వనితను ‘దేవి’ సినిమాతో నటిగా పరిచయం చేసిన దర్శకుడు ఎం.ఎస్. రాజు, ఇప్పుడు వనిత కుమార్తె జోవికా విజయ్ కుమార్‌ను ‘అగధ’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాలో జోవికా ‘హరిణి’ అనే పాత్రలో కనిపించనుంది. తాజాగా విడుదల చేసిన క్యారెక్టర్ పోస్టర్‌లో ఆమె వర్షంలో, పురాతన నేపథ్యంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ, అమాయకత్వం మరియు అంతర్ముఖ శక్తిని ప్రతిబింబించేలా కనిపించింది.

‘అగధ’ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు సినిమా ఇంటెన్సిటీని బలంగా చూపిస్తున్నాయి. ఎం.ఎస్. రాజు కథ, దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సుమారు 85 రోజుల షూటింగ్, విస్తృతమైన సెట్లు, దాదాపు 45 నిమిషాల విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం ప్రత్యేకమైన అనుభూతిని అందించనుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ‘అగధ’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో కల్కి 2 షూటింగ్

హైదరాబాద్‌లో కల్కి 2 షూటింగ్

సీవీ ఆనంద్‌కు అభినందనలు తెలిపిన చిరంజీవి

సీవీ ఆనంద్‌కు అభినందనలు తెలిపిన చిరంజీవి

‘భోగి’ హీరోయిన్‌ లుక్‌ రిలీజ్‌

‘భోగి’ హీరోయిన్‌ లుక్‌ రిలీజ్‌

‘దృశ్యం 3’ టీజర్ టెన్షన్ పెంచింది.. అదిరిపోయిన జార్జ్‌కుట్టి రీ-ఎంట్రీ!

‘దృశ్యం 3’ టీజర్ టెన్షన్ పెంచింది.. అదిరిపోయిన జార్జ్‌కుట్టి రీ-ఎంట్రీ!

‘ఫస్ట్ టైమ్’ ట్రైలర్ సెన్సేషన్.. టెక్నాలజీతో కొత్త అనుభూతి!

‘ఫస్ట్ టైమ్’ ట్రైలర్ సెన్సేషన్.. టెక్నాలజీతో కొత్త అనుభూతి!

‘మైసా’ కోసం రష్మిక సాహసం

‘మైసా’ కోసం రష్మిక సాహసం

ట్యాగ్లు
అగధ సినిమాజోవికా విజయ్ కుమార్మంజులవనితఎంఎస్ రాజుతెలుగు సినిమాతమిళ సినిమాకన్నడ సినిమాపాన్ ఇండియా మూవీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై ఆరోపణలు
క్రీడలు

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై ఆరోపణలు

థామస్ కప్‌లో భారత్‌కు చేదు అనుభవం..
క్రీడలు

థామస్ కప్‌లో భారత్‌కు చేదు అనుభవం..

ఫైనల్లో అడ్వాణీకి షాక్
క్రీడలు

ఫైనల్లో అడ్వాణీకి షాక్

అవసరమైతే యుద్ధానికి సిద్ధం: రాజ్‌నాథ్ సింగ్!
జనరల్

అవసరమైతే యుద్ధానికి సిద్ధం: రాజ్‌నాథ్ సింగ్!

శ్రీలంక క్రికెట్‌లో సంక్షోభం... వైఫల్యాలు, ఆర్థిక ఆరోపణల మధ్య బోర్డు రాజీనామా!
క్రీడలు

శ్రీలంక క్రికెట్‌లో సంక్షోభం... వైఫల్యాలు, ఆర్థిక ఆరోపణల మధ్య బోర్డు రాజీనామా!

డ్రాగన్‌లో ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్... ఒక్కటి కాదు రెండు లుక్స్!
గాసిప్స్

డ్రాగన్‌లో ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్... ఒక్కటి కాదు రెండు లుక్స్!

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్…బట్లర్ సరదా కామెంట్స్...
క్రీడలు

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్…బట్లర్ సరదా కామెంట్స్...

వేంపల్లి పీఎస్‌లో అంబటి రాంబాబు విచారణ...
రాజకీయాలు

వేంపల్లి పీఎస్‌లో అంబటి రాంబాబు విచారణ...

ఉస్మానియా వైద్య చరిత్రలో మరో మైలురాయి!
జనరల్

ఉస్మానియా వైద్య చరిత్రలో మరో మైలురాయి!

అర్హులైన రైతులకు రుణమాఫీ కావట్లేదని హైకోర్టులో హరీశ్‌రావు పిటిషన్!
జనరల్

అర్హులైన రైతులకు రుణమాఫీ కావట్లేదని హైకోర్టులో హరీశ్‌రావు పిటిషన్!

కల్వకుంట్ల కవితకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఈసీ!
రాజకీయాలు

కల్వకుంట్ల కవితకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఈసీ!

‘కర’ మూవీ రివ్యూ: యాక్షన్, ఎమోషన్‌ల కలయికగా ధనుష్ సినిమా!
రివ్యూలు

‘కర’ మూవీ రివ్యూ: యాక్షన్, ఎమోషన్‌ల కలయికగా ధనుష్ సినిమా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!