
జనరల్

రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 18న ముంబై వేదికగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ స్పెషల్ ఈవెంట్ కోసం చిత్రబృందం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండగా, దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించేలా గ్రాండ్ ప్లానింగ్ జరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ఈ చిత్ర హిందీ రిలీజ్ బాధ్యతలను సొంతం చేసుకుని భారీ ప్రమోషన్స్‌కు సిద్ధమైంది.
ముంబైలో జరగనున్న ఈ ట్రైలర్ ఈవెంట్‌కు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యే అవకాశముందని సమాచారం. రామ్ చరణ్‌కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్‌కు తగ్గట్టుగా నేషనల్ వైడ్ ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ట్రైలర్ విడుదలతో ఆ హైప్ మరింత పెరగనుందని అభిమానులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!