

ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రం విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సినిమా డిసెంబర్ విడుదల రేసు నుంచి తప్పుకున్నట్లు ఇప్పటికే సంకేతాలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మార్చిలో విడుదలైతే.. ‘ఫౌజీ’ని వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో జనవరి మూడో వారంలో రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసే అవకాశాన్ని కూడా చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
మరోవైపు అక్టోబర్‌లో ‘ఫౌజీ’ నుంచి ప్రత్యేక టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ టీజర్‌తో సినిమా విడుదల తేదీపై స్పష్టత వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. స్వాతంత్ర్యానికి పూర్వం కాలం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ బ్రాహ్మణ సైనికుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, పలువురు బాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చివరి దశ షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఓ పాటను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!