

అమెరికా-ఇరాన్ చర్చల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని అమెరికా నుంచి వెళ్లిపోవాలని విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదేశించినట్లు ‘ఆక్సియోస్’ కథనం పేర్కొంది. చర్చల్లో పురోగతి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ నివేదిక తెలిపింది. అరాగ్చీ బృందం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ కోసం న్యూయార్క్‌లో ఉన్న సమయంలో ఇరుదేశాల మధ్య ఖతార్ మధ్యవర్తిత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిగాయి.
అయితే అమెరికా తమను వెళ్లగొట్టిందన్న వార్తలను ఇరాన్ ప్రతినిధి బృందం ఖండించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే న్యూయార్క్ నుంచి బయలుదేరామని, సెప్టెంబర్ 17నే ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖకు తెలియజేశామని పేర్కొంది. చర్చల్లో కీలక అంశాలపై ఇరుదేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షలు, హోర్ముజ్ జలసంధి తదితర అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!