

అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన విడుదల విధానంపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన రెండు భాగాల చిత్రీకరణను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసేలా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నిర్మాణ వ్యయం, ఇతర హక్కుల వ్యాపారాన్ని పరిగణనలోకి తీసుకుని కథను రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తొలి భాగాన్ని 2027 డిసెంబర్‌లో, రెండో భాగాన్ని 2028లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియోకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో దీపికా పదుకోణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘రాకా’ రెండు భాగాలుగా విడుదల కానుందన్న వార్తలు నిజమైతే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!