
జనరల్

ఆసియా గేమ్స్ సెమీఫైనల్లో శ్రీలంకపై భారత్ 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 80 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇషాన్ కిషన్‌కు వైభవ్ సూర్యవంశీ 38 పరుగులతో సహకారం అందించాడు. శ్రేయస్ అయ్యర్ 13 పరుగులు చేయగా, మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరు చేయలేకపోయారు. చివర్లో ఇషాన్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ పోరాడదగ్గ స్కోరును నమోదు చేసింది. దీంతో ఫైనల్ బెర్త్ కోసం శ్రీలంక ముందు 170 పరుగుల లక్ష్యం నిలిచింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!