
షోస్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 59 శాతానికి మించకూడదని కోర్టు స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కోర్టు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోగా ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం. బీసీల జనగణన పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసినట్లు తెలుస్తోంది. తాజా తీర్పుతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!