

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓ మాట అనుకుందామా! చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్‌ను సీనియర్ నటులు సుహాసిని మణిరత్నం, వినోద్ కుమార్ ఆవిష్కరించారు. మాస్టర్ కనిష్క్ మహాబలాహ్ సమర్పణలో శ్రీ శుభకర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో సుహాసిని, వినోద్ కుమార్, ఇంద్రజ కీలక పాత్రలు పోషిస్తుండగా, శ్రీనివాస్ అనంతనేని, మోనికా మిశ్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, కార్తికేయ దేవ్, అజిజ్ ఖాన్, అన్నపూర్ణమ్మ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

దర్శకుడు భీమ్జీ మాట్లాడుతూ, ఫస్ట్ లుక్ విడుదల చేసిన సీనియర్ నటీనటులకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబం అంతా కలిసి చూసేలా ఒక సరికొత్త ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని చెప్పారు. నిర్మాతలు పెంటి నాగరాజు, పెంటి నీరజ్ సందీప్ మాట్లాడుతూ, భీమ్జీ కథ తమకు ఎంతో నచ్చిందని, త్వరలో టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తామని వెల్లడించారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!