

ఇమ్రాన్ హష్మీ నటించిన తాజా రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘అవారాపన్ 2’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నట్లు సమాచారం. ఈ సినిమా భారత్‌లో నెట్‌గా రూ.127 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.180 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల నివేదికలు చెబుతున్నాయి. ఈ వసూళ్లతో ఇమ్రాన్ హష్మీ ఖాతాలో మరో భారీ విజయంగా ఈ చిత్రం నిలుస్తోంది.
నోస్టాల్జియా, ఆకట్టుకునే సంగీతం, ఎమోషనల్ కథనం, మాస్ అంశాలు సినిమాకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ ప్రేక్షకుల స్పందన కొనసాగుతున్నట్లు సమాచారం. ‘అవారాపన్ 2’ విజయంతో ఇమ్రాన్ హష్మీ మరోసారి తన బాక్సాఫీస్ సత్తాను చాటారని అభిమానులు భావిస్తున్నారు. భావోద్వేగాలకు కమర్షియల్ అంశాలను జోడిస్తే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారనే విషయాన్ని ఈ చిత్రం మరోసారి నిరూపించిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!