
న్యూస్

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 3 ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా విడుదలైన పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. “ది పాస్ట్ నెవర్ స్టేస్ సైలెంట్” అనే ట్యాగ్‌లైన్‌తో కథ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నట్టు పోస్టర్ సూచిస్తోంది. కుటుంబం, న్యాయం, గతం చుట్టూ తిరిగే కథ ఈసారి మరింత తీవ్రమైన మలుపులతో సాగనుందని సమాచారం.
ఈ చిత్రాన్ని దర్శకుడు జీతూ జోసఫ్ తెరకెక్కించగా, 2026 ఏప్రిల్ 2 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటివరకు వచ్చిన భాగాల తరహాలో బలమైన కథనం, సస్పెన్స్ అంశాలతో దృశ్యం 3 ప్రేక్షకులను కట్టిపడేయనుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది. విడుదల తేదీ ఖరారుతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!