
ఆరోగ్యం

శ్రీ నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అగ్లీ స్టోరీ’ డిస్నీ+ హాట్‌స్టార్‌లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం 8.1 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి, ‘ధురంధర్’, ‘ది రాజా సాబ్’ తర్వాత అత్యధికంగా వీక్షించిన చిత్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణపై చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది.
ఈ చిత్రంలో శ్రీ నందు నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని అభిప్రాయపడుతున్నారు. కథాబలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న శ్రీ నందుకు ఈ విజయం కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలవనుందని, ఆయన రాబోయే సినిమాలపై అంచనాలు మరింత పెరిగాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!