

డ్రాగన్ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రం విడుదలై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన నాలుగు నిమిషాల వీడియో సినిమాలోని పాత్రలు, కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ కథను ముందుగానే పరిచయం చేయడం పూర్తిగా వ్యూహాత్మక నిర్ణయమని తెలిపారు. నేటి ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్లే ముందే కథా ప్రపంచాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నారని, హాలీవుడ్ తరహాలోనే “డ్రాగన్” ప్రచార చిత్రాన్ని రూపొందించామని వెల్లడించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ “లూగర్” అనే ప్రతినాయక ఛాయలతో కూడిన శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని చెప్పారు.
భారతీయ సినిమాల్లోనే అత్యంత ఖరీదైన ప్రతినాయక శైలిలోని పాత్రగా ఇది నిలుస్తుందని ప్రశాంత్ నీల్ అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తుండగా, సినిమా వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సమయంలో ఎన్టీఆర్ తన పెంపుడు మకావ్ పక్షులను అభిమానులకు పరిచయం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫొటోలో వాటి పేర్లు “అసహీ”, “యూహీ” అని జపనీస్‌లో పెట్టినట్లు వెల్లడించారు. జపాన్‌పై తనకున్న అభిమానానికి ఇవే ప్రతిబింబమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సినిమాలకు జపాన్‌లో విశేష ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!