

ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఎన్టీఆర్ రాకతో ఈవెంట్‌కు అదనపు క్రేజ్ ఏర్పడగా, ఎంట్రీ పాస్‌లకు కూడా భారీ డిమాండ్ ఉన్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!