

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ‘పుష్ప’తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అయితే ఆయన కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’. రాజమౌళి అండ్ టీం మద్దతుతో శశాంక్ యేలేటి రూపొందిస్తున్న ఈ మ్యాజికల్ థ్రిల్లర్ నుంచి తాజాగా ఆసక్తికరమైన ట్రైలర్ విడుదలైంది. నటసింహం బాలయ్య బేస్ వాయిస్‌లో వినిపించిన ఆయన ప్రసిద్ధ డైలాగ్ ట్రైలర్‌కు ఆకర్షణగా నిలిచింది. డబ్బులు, సమస్యలతో నిండిన జీవితాన్ని గడిపే సూరి పాత్రలో ఫహద్ కనిపించనున్నారు. అతడి జీవితంలోకి ఓ మ్యాజికల్ పాప రావడంతో జరిగే పరిణామాలే కథగా కనిపిస్తున్నాయి.
ట్రైలర్లో కనిపించిన విజువల్స్ సినిమాకు ఆకర్షణను తీసుకొచ్చాయి. ఫాంటసీ ప్రపంచాన్ని తలపించేలా రిచ్‌గా రూపొందించిన దృశ్యాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. ఫహద్, చిన్నారి మధ్య సాగే భావోద్వేగ ప్రయాణం కూడా కథలో కీలకంగా కనిపిస్తోంది. దీంతో అక్టోబర్ 2న ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఎస్ ఎస్ కార్తికేయ, బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు కలిసి ఈ సినిమాను నిర్మించారు. ట్రైలర్లో చూపించిన మాయాజాలం వెండితెరపై ఎలా ఉంటుందో చూడాలి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!