

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవిత ప్రయాణం, ప్రజాపాలన నేపథ్యంలో గిరి నల్ల తెరకెక్కించిన “ఒక యోధుని ప్రజాపాలన” డాక్యుమెంటరీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చిన్ననాటి నుంచి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ చిత్రంలో చూపించారు. ఈ డాక్యుమెంటరీ ప్రివ్యూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నరసన్న, కోదండరామిరెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడిన అతిథులు దర్శకుడు గిరి నల్లను అభినందించారు. సామాన్యుడిగా ప్రారంభమైన రేవంత్ రెడ్డి ప్రయాణం ప్రజా నాయకుడిగా ఎలా మారిందో చిత్రంలో బాగా చూపించారని అన్నారు. ప్రజలకు దగ్గరైన పాలన, నాయకత్వ లక్షణాలు ఈ డాక్యుమెంటరీలో స్పష్టంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించానని దర్శకుడు గిరి నల్ల తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!