

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈరోజు ముంబైలో జరగనుండగా, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌ను సాయంత్రం 4:05 గంటలకు యూట్యూబ్‌లో ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ రెజ్లింగ్ సీక్వెన్స్‌లో కనిపిస్తున్న పవర్ఫుల్ పోస్టర్‌ను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ముంబైలో జరుగనున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో ‘పెద్ది’పై అంచనాలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!