

బాలీవుడ్ నటుడు దిల్జిత్ దోసంజ్ నటించిన ‘సట్లుజ్’ (పంజాబ్ 95) సినిమా మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. సెన్సార్ సమస్యల కారణంగా దాదాపు నాలుగేళ్లు విడుదల కాకుండా నిలిచిపోయిన ఈ చిత్రం, ఎలాంటి కత్తిరింపులు లేకుండా జూలై 3, 2026న జీ5 ఓటీటీలో విడుదలైంది. అయితే విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే భారతదేశంలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ నుంచి తొలగించడంతో ప్రేక్షకుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
1990ల పంజాబ్ మిలిటెన్సీ కాలంలో అదృశ్యమైన, ఎన్‌కౌంటర్లలో మరణించిన వేలాది మంది కేసులను వెలుగులోకి తీసుకొచ్చిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. థియేటర్లలో విడుదల కోసం సీబీఎఫ్‌సీ సుమారు 127 కత్తిరింపులు సూచించగా, చిత్రబృందం అంగీకరించలేదు. దీంతో సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైంది. తాజా పరిణామాల నేపథ్యంలో సినిమాను తాత్కాలికంగా తొలగించామని, త్వరలోనే మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తామని జీ5 వెల్లడించింది. అయితే జీ5 గ్లోబల్ ద్వారా ఇతర దేశాల్లో ఈ చిత్రం ఇంకా స్ట్రీమింగ్ అవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!