

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మౌనీ రాయ్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆమె సినిమాల కంటే వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. భర్త సూరజ్ నంబియార్‌తో విభేదాలు వచ్చాయనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారనే సమాచారం ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది. అంతేకాదు, మౌనీ తన సోషల్ మీడియా ఖాతా నుంచి సూరజ్‌తో ఉన్న కొన్ని ఫోటోలను తొలగించిందని నెటిజన్లు గుర్తించారు. మరోవైపు సూరజ్ తన అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశాడనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే దూరం పెరిగిందా అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
మౌనీ, సూరజ్ 2019లో దుబాయ్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో పరిచయం కాగా, కొన్నేళ్ల ప్రేమ అనంతరం 2022లో గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కలిసి కనిపిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్న ఈ జంటపై ఇప్పుడు వస్తున్న వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు. ఇవి కేవలం ఊహాగానాలేనా అనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు మౌనీ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండి, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో ప్రత్యేక గీతంలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ ప్రచారాలపై మౌనీ త్వరలోనే స్పందించే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!