

‘కేజీఎఫ్’ సిరీస్ ఘనవిజయాల తర్వాత కథానాయకుడు యశ్ నుంచి రానున్న కొత్త చిత్రం టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాను మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్రాజు ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ హక్కులను రూ.120 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ మార్కెట్ విస్తృతంగా పెరిగిందని, నాలుగేళ్ల విరామం తర్వాత వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉందని ఆయన తెలిపారు.

ఇది ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కాగా, కన్నడ మరియు ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను రాజీవ్ రవి నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణల్లో తమ ఎస్వీసీ బ్యానర్ ద్వారా ఈ సినిమాను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని దిల్రాజు పేర్కొన్నారు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!