
జనరల్

దక్షిణ భారత సినీ చరిత్రలో సంచలన విజయంగా నిలిచిన “బాష” సినిమా గురించి తాజాగా ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. దర్శకుడు సురేష్ కృష్ణ ముందుగా ఈ కథను చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్‌కు వినిపించినట్లు సమాచారం. కథలో ఉన్న మాస్ అంశాలు, హీరో ఎలివేషన్‌లు అప్పుడే భారీ విజయానికి సంకేతాలుగా కనిపించాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే కీలక సమయంలో ఆర్థిక కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది. అనంతరం అదే కథతో రజినీకాంత్ నటించగా, సినిమా తమిళంలో ఘన విజయాన్ని సాధించింది. ఆ చిత్రం రజినీకాంత్ స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. తర్వాత తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదలై ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. చిరంజీవి ఈ సినిమా చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదన్న చర్చ ఇప్పుడు మళ్లీ మొదలైంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!