
క్రీడలు

ఐకానిక్ బాలీవుడ్ పాటల కాపీరైట్ వివాదం మధ్య ‘ధురంధర్: ది రివెంజ్’ ఓటీటీ విడుదలపై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ‘త్రిదేవ్’ సినిమాలోని ప్రసిద్ధ గీతం ‘తిర్చీ టోపీవాలే’తో పాటు ‘రంగ్ దే లాల్ (ఓయే ఓయే)’ పాటల వినియోగంపై ట్రిమూర్తి ఫిల్మ్స్ కోర్టును ఆశ్రయించింది. అయితే ప్రస్తుతం సినిమా విడుదలను నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది.
అయితే కేసు విచారణ పూర్తయ్యే వరకు భద్రతా చర్యగా టీ-సిరీస్‌కు చెందిన సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ‘ధురంధర్: ది రివెంజ్’ ఓటీటీ స్ట్రీమింగ్ కొనసాగనుంది. ఈ వివాదం బాలీవుడ్‌లో క్లాసిక్ పాటల హక్కులు, మ్యూజిక్ అడాప్టేషన్ అంశాలపై మరోసారి చర్చకు దారితీసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!