

హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై ప్రధాన పాత్రల్లో నటించిన ‘దీవానా’ చిత్రం జూన్ 20న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో చిత్రబృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. అదే సమయంలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేకపోయినా చిత్రానికి A సర్టిఫికేట్ ఇవ్వడంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల కుటుంబ ప్రేక్షకులు సినిమాను చూడటానికి వెనుకంజ వేస్తున్నారని వారు పేర్కొన్నారు.
నిర్మాత వాసుదేవ్ కొప్పినేని, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి, హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ చిత్రంలో ముద్దు సన్నివేశాలు గానీ, అధిక హింస గానీ లేవని స్పష్టం చేశారు. సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం కావడంతో ప్రీమియర్ షోలను కూడా నిర్వహించలేకపోయామని తెలిపారు. కొత్త కథలతో వస్తున్న యువ దర్శకులు, నిర్మాతల ఉత్సాహాన్ని ఇలాంటి నిర్ణయాలు దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు.
అయితే ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రేమ, ఆదరణ తమకు మరింత ధైర్యాన్ని ఇస్తోందని చిత్రబృందం పేర్కొంది. తండ్రి-కొడుకు అనుబంధం, ప్రేమ, స్నేహం వంటి భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా చూపించిన ఈ చిత్రం ఇంకా మంచి విజయాన్ని సాధిస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను చూడాలని కోరుతూ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలను ₹100కి తగ్గించినట్లు ప్రకటించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!