

నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మ్యాడ్ యాక్షన్, భావోద్వేగాలతో కూడిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్ తొలుత మిశ్రమ స్పందనను ఎదుర్కొంది. ముఖ్యంగా నాని వేగంగా పలికిన సంభాషణలు ప్రేక్షకులకు పూర్తిగా అర్థం కాకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ కూడా జరిగింది. టీజర్‌లోని మాటలను అర్థమయ్యేలా చిత్రబృందం ప్రత్యేకంగా వివరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ స్పందనను గమనించిన చిత్రబృందం వెంటనే మరోసారి టీజర్‌ను సవరించింది.
ఈసారి నాని చెప్పిన సంభాషణలు స్పష్టంగా వినిపించేలా మార్పులు చేసి కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. దీంతో ప్రేక్షకుల నుంచి మళ్లీ సానుకూల స్పందన రావడం మొదలైంది. తొలుతే ఇలాంటి మార్పులు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అనుభవంతో సినిమా తుది రూపకల్పనలో మరింత జాగ్రత్త తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. టీజర్ విషయంలో ఎదురైన అనుభవం సినిమా విషయంలో పునరావృతం కాకుండా చిత్రబృందం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!