
క్రీడలు

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన చూపిస్తోంది. ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 10 రోజుల్లో రూ.12.67 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం రెండో వారంలో కూడా సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఈ చిత్రానికి యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. రెండో వారం పూర్తయ్యే సరికి బాక్సాఫీస్ వద్ద ఇంకా మెరుగైన వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
“కపుల్ ఫ్రెండ్లీ” చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో, యూవీ కాన్సెప్ట్స్ తెలుగు మరియు తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా, అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఏపీ, తెలంగాణలో ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని విడుదల చేశారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!