

టాలీవుడ్‌లో ప్రస్తుతం బాక్సాఫీస్ లెక్కలు కొత్త దిశగా మారుతున్నాయి. భారీ స్టార్ హీరోలు లేకపోయినా బలమైన కథ, మంచి కథనం, ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ ఉంటే సినిమాలు విజయాన్ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా మిడ్ బడ్జెట్ చిత్రాలకు వస్తున్న స్పందన పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. దీంతో స్టార్ పవర్ కంటే కంటెంట్‌కే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ మొదలైంది.
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. ఓవర్సీస్‌లో రూ.45 కోట్లు రాబట్టి రూ.200 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మా ఇంటి బంగారం కూడా రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది. రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన డీసీ సైతం భారీ వసూళ్లు సాధిస్తోంది. కొరియన్ కనకరాజు, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో రాబడుతున్నాయి. కంటెంట్, మౌత్ టాక్, విడుదల సమయం సినిమాల విజయాన్ని ప్రభావితం చేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!