
జనరల్

రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ విడుదలకు ముందే నార్త్ అమెరికా మార్కెట్‌లో సత్తా చాటుతోంది. ఈ సినిమా ప్రీ-సేల్స్ ఇప్పటికే $250,000 మార్క్‌ను దాటాయి. దీంతో ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమాపై ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమవుతోంది.
ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. AMC చైన్‌లో ఇంకా బుకింగ్స్ ప్రారంభం కాలేదు. AMCతో పాటు మరిన్ని స్క్రీన్లకు బుకింగ్స్ అందుబాటులోకి వస్తే ప్రీ-సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. యష్ అభిమానులతో పాటు ఓవర్సీస్ ట్రేడ్ వర్గాల్లోనూ టాక్సిక్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!