

తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. తిరుమలలోని శ్రీ రంగనాయకుల మండపంలో ఆశీర్వాదాలు అందుకున్న అనంతరం ఆయన తిరుపతికి చేరుకుని అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి నేతలు శ్రీధర్ వర్మను కలిసి అభినందనలు తెలిపారు.
ఎస్వీబీసీ ఛైర్మన్‌గా అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీధర్ వర్మ అన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఖ్యాతిని, హిందూ ధర్మ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో ఎస్వీబీసీ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగులందరితో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన రూపా, కామినేని సీమంతిని, దగ్గుబాటి నివేదిత, ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ హాజరై శ్రీధర్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!