

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10పై సోషల్ మీడియాలో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. షో ప్రారంభ తేదీ, కంటెస్టెంట్ల పేర్లపై పలు సోషల్ మీడియా పేజీలు, ఫ్యాన్ చానెళ్లు వరుసగా అప్‌డేట్స్ పంచుకుంటున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ తెలుగు 10 ప్రారంభమయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ తేదీతో పాటు కంటెస్టెంట్ల జాబితా కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇక కంటెస్టెంట్లుగా ఎవరెవరు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారనే చర్చకు కూడా తెరలేచింది. నటుడు త్రిగుణ్ అలియాస్ ఆదిత్ ఈశ్వరన్ పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు సీజన్ 10లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియా అప్‌డేట్స్ పేర్కొంటున్నాయి. అలాగే సీరియల్ నటి సౌందర్య రెడ్డి పేరు కూడా కంటెస్టెంట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. షో ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ మరిన్ని పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!